బైక్‌పై రెచ్చిపోయిన ప్రేమ జంట
కోల్‌కత్తాలో ఓ ప్రేమ జంట నడి రోడ్డుపై రెచ్చిపోయింది. యువకుడు తన ప్రియురాలిని బైక్ ట్యాంక్‌పై కూర్చోబెట్టుకుని నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశాడు. ఈ తతంగాన్ని కొందరు రికార్డు చేసి పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ గా మారింది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన తర్వాత కూడా పక్క ప్రపంచాన్ని పట్టించుకోకుండా వీరు కబుర్లలో మునిగిపోయారు. వీరిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.